Annaatthe Trailer: అన్నాత్తె నుండి అదిరిపోయే అప్డేట్..!

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో శివ తెరకెక్కిస్తున్న చిత్రం అన్నాత్తె (Annaatthe). ప్రకాశ్‌రాజ్, సురేశ్, ఖుష్బూ సుందర్, మీన, నయనతార, కీర్తి సురేశ్(Keerthy suresh) కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఫస్ట్ లుక్స్,టీజర్స్ అంటూ చిత్రంపై ఆసక్తి పెంచిన మేకర్స్ ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. సాయంత్రం ఆరు గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. రజనీకాంత్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రాబోతుంది. ‘అన్నాత్తై’ సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి సంస్థ సొంతం చేసుకుంది.
పెద్దన్న చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల పెద్దన్న టీజర్ వెంకటేష్ విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది. ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

