తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలి కాలంలో పెద్దగా సక్సెస్‌లు సాధించలేదు.ఆయన నుండి భారీ బ్లాక్ బస్టర్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చివరిగా శివ తెరకెక్కించిన అన్నాత్తే చిత్రంలో నటించగా,ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఈ సినిమా నుండి రేపు రెండు అప్డేట్స్ రానున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం నుంచి రజినీ ఫస్ట్ లుక్ ని మొదట ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తుండగా ఈ లుక్ తాలూకా అదిరే మోషన్ పోస్టర్ టీజర్ ని సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
ఈ విషయం తెలియజేసేందుకు ఒక పోస్టర్ విడుదల చేయగా, ఇందులో వెనక్కి తిరిగి ఉన్న రజనీకాంత్, శూలాలు, భవనాలు కనిపిస్తున్నాయి. అన్నాత్తె చిత్రం ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని అంటున్నారు.కీర్తి సురేష్ ఈ చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా ఉంటుందని తెలుస్తుంది. ఖుష్బూ, నయనతార ,మీనా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.