దర్భార్ చిత్రం తర్వాత అన్నాత్తె అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించేందుకు వస్తున్నారు సూపర్ స్టాన్ రజనీకాంత్ . మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన అన్నాత్తె సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. తలా అజిత్‌తో వరుసగా చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్లను కొట్టిన శివ.. ఇప్పుడు రజినీతో మాస్ ఆడియన్స్‌కి పసందైన వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడు.
వినాయక చవితి సందర్భంగా అన్నాత్తె నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్లోపంచెకట్టులో రజినీ స్టైల్, ఆ మార్క్‌ను మరోసారి చూపించారు. ఇక కొద్ది సేపటి క్రితం మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రజనీకాంత్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై హెల్మెట్ పెట్టుకొని పోతున్నట్టు కనిపించారు. శత్రువల భరతం పట్టేందుకు చేతిలో కత్తి కూడా ఉంది.
రజనీకాంత్ స్టైల్లో మోషన్ పోస్టర్ ఉండగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలానే ఉంది. నవంబర్ 4న దీపావళి శుభాకాంక్షలతో ఈ సినిమా విడుదల కానుంది.ఇందులో రజినీ పక్కన నయనతార కనిపించబోతోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.