Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ .. మెగా ఫ్యామిలీ అన్‌సీన్ ఫోటో షేర్ చేసిన పవన్ భార్య
Ram Charan | టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, సోషల్ మీడియా అంతా చరణ్ బర్త్‌డే పోస్టులతో నిండిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సభ్యులు షేర్ చేసిన ప్రత్యేక ఫోటోలు, సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ram Charan | టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, సోషల్ మీడియా అంతా చరణ్ బర్త్‌డే పోస్టులతో నిండిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సభ్యులు షేర్ చేసిన ప్రత్యేక ఫోటోలు, సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే చరణ్ వ్యక్తిత్వం, వినయం, కష్టపడి ఎదిగిన తీరు గురించి తెలిసిన వారు ఈ రోజును పండుగలా జరుపుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్‌కు ఇప్పుడు వస్తున్న బర్త్‌డే విషెస్ రేంజ్ మరింత పెరిగింది. అభిమానుల ప్రేమ, సెలబ్రిటీల ప్రశంసలు ఈ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా మార్చాయి.
ప్రస్తుతం చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడినప్పటికీ, త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి వచ్చి అభిమానులను కలవడం ఫ్యాన్స్‌కు రిలీఫ్ ఇచ్చింది. తన ఆరోగ్యం బాగానే ఉందని స్వయంగా చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బర్త్‌డే సందర్భంగా ఒక అన్‌సీన్ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి చరణ్ ఉన్న ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు. “మార్క్ మరియు మా కుటుంబం తరపున చరణ్ అన్నకు హ్యాపీ బర్త్‌డే” అంటూ ఆమె చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది.
ఆ ఫోటోలో చరణ్ పక్కన కూర్చుని మార్క్ ఫోన్ చూస్తుండగా, చరణ్ ఎంతో ప్రేమగా అతన్ని గమనిస్తున్న తీరు నెటిజన్లను ఫిదా చేసింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. అలాంటిది ఈ సందర్భంలో బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక కెరీర్ పరంగా చూస్తే, ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చరణ్ ప్రతి ప్రాజెక్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది’ కోసం ఆయన చేసిన మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.తాజాగా విడుదలైన టీజర్ మూవీపై అంచనాలు రెట్టింపు చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

