Anjali | గీతాంజలి భయపెడుతూ నవ్విస్తుంది
Anjali | అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి’ చిత్రం హారర్ కామెడీ ఎంటర్టైనర్స్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. అంజలి కెరీర్లో 50వ చిత్రమిది కావడం విశేషం. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు.
Anjali | అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి’ చిత్రం హారర్ కామెడీ ఎంటర్టైనర్స్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. అంజలి కెరీర్లో 50వ చిత్రమిది కావడం విశేషం. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు. హారర్, కామెడీ అంశాల కలబోతగా ట్రైలర్ ఆసాంతం వినోదంతో పాటు ఉత్కంఠను పంచింది.
చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఓ తెలుగమ్మాయి యాభై సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం. అంజలి కెరీర్లో చాలా ప్రత్యేకమైన మూవీ ఇది. ఈ సినిమాకు సాంకేతికంగా మంచి టీమ్ కుదిరింది. ట్రైలర్లో చూసింది కొంతే. సినిమా ధమ్ బిర్యానీలా ఉంటుంది’ అన్నారు. తొలిభాగం కంటే ఈ సినిమా వందరెట్ల వినోదాన్ని పంచుతుందని, తన కెరీర్లో యాభయ్యవ చిత్రం చాలా స్పెషల్గా ఉండాలని కోరుకున్నానని, అది ఈ సినిమాతో తీరిందని కథానాయిక అంజలి ఆనందం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీశామని దర్శకుడు శివ తుర్లపాటి అన్నారు. ఈ సినిమాలో తాను చెనక్కాయల శీను అనే పాత్రలో చక్కటి హాస్యాన్ని పండించానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ: కోన వెంకట్, దర్శకత్వం: శివ తుర్లపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

