టాలీవుడ్లో తాను చేసిన ఒకట్రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అనిత. ‘నువ్వు నేను’, ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’ వంటి చిత్రాల్లో నటించిన అనిత 2013లో రోహిత్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలని తగ్గించేసి టీవీ సీరియల్స్ బాట పట్టింది. హిందీలో నాగిణి అనే సీరియల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనిత ఎప్పటిప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. తాను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా బేబి బంప్‌తో ఫొటో షూట్ చేసి షాకిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అనిత. దీంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
బేబి బంప్‌తో ఉన్నప్పుడే హాట్ ఫొటో షూట్ చేసి షాకిచ్చిన అనిత తాజాగా థైస్ షోతో పిచ్చెక్కిస్తుంది. తన ఇన్‌స్టాగ్రాములో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌కి కిక్కిస్తుంది. పెళ్లై పిల్లాడు పుట్టిన తర్వాత కూడా అనిత గ్లామర్ షో చేస్తుంది అంటే మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తుందేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.