Anirudh Ravichander | హీరోగా అనిరుధ్ రవిచందర్.. దర్శకుడు ఎవరో తెలుసా?
Anirudh Ravichander | ఇప్పటికిప్పుడు సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్‌కు అసలు సిసలైన నిర్వచనం తెలుపుతున్నాడు.
Anirudh Ravichander | ఇప్పటికిప్పుడు సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్‌కు అసలు సిసలైన నిర్వచనం తెలుపుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ నేపథ్య సంగీతం గురించి మాట్లాడని సినీ ప్రేక్షకుడు లేడు. హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్ మ్యూజిక్కు అభిమానులు చొక్కాలు చింపుకుని చిందులేస్తున్నారు. విక్రమ్‌లో కమల్‌కు, జైలర్‌లో రజనీకు అనిరుధ్ ఇచ్చిన మాస్ మ్యూజిక్కు తమిళ తంబిలే కాదు.. తెలుగు కుర్రాళ్లు సైతం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనిరుధ్ క్రేజ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఆయన బయట కనిపిస్తే జనాలు వెర్రెత్తిపోతున్నారు. ఈ క్రేజ్ దృష్ట్యా అనిరుధ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ మీడియాలు కోడై కూస్తున్నాయి. సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అనిరుధ్ కోసం ఓ కథను సిద్ధం చేశాడట. అంతేకాకుండా లోకేష్ సినిమాలకు పనిచేసే స్టంట్ మాస్టర్లు అన్బరవీలు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. అన్ని కుదరితే వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉందని సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది.
అంతేకాకుండా ఈ సినిమా మొత్తం యాక్షన్‌తో నిండిఉండనుందట. యాక్షన్ నేపథ్యంలోనే లోకేష్ కూడా కథను రాసుకున్నాడట. ప్రస్తుతం చెన్నైలో ఇదే హాట్‌టాపిక్ అయింది. నలుగురు కలిసి స్క్రీన్‌పైన ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తారో అని అప్పుడు తమిళ తంబీలు తెగ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

