Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్తల్లో కొత్త ట్విస్ట్.. గ్రీస్‌లో పెళ్లి అంటూ వైరల్, అసలు నిజం ఇదేనా?
Anirudh-Kavya | సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దీనికి కారణం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సీఈఓ కావ్య మారన్‌తో అనిరుధ్ వివాహం జరగబోతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.
Anirudh-Kavya | సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దీనికి కారణం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సీఈఓ కావ్య మారన్‌తో అనిరుధ్ వివాహం జరగబోతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా వీరిద్దరి పెళ్లి గ్రీస్ దేశంలో అత్యంత ఘనంగా జరిగినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. అయితే ఈ వివాహానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు ఈ వార్తల్లో నిజమెంత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వెనుక కథేంటి? అనే చర్చ మొదలైంది.
అనిరుధ్, కావ్య మారన్ వివాహం గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగిందంటూ కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకను అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించడంతో ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వివాహానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుటుంబ సభ్యులు హాజరైనట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వివరాలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. అనిరుధ్ లేదా కావ్య మారన్ కుటుంబ సభ్యులు ఈ వార్తలపై స్పందించకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే అనిరుధ్, కావ్య మారన్ వివాహ వార్తలకు మరింత హైప్ తీసుకొచ్చిన అంశం ఒక వైరల్ వీడియో. గ్రీస్‌లో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకుంటున్నట్లుగా కనిపించే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు నిజంగానే వారి నిశ్చితార్థం లేదా వివాహ వేడుకకు సంబంధించిన దృశ్యాలని భావించారు. కొత్త జంటకు ముందుగానే శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే ఈ వీడియో నిజమైన వేడుకకు సంబంధించినదని నిర్ధారించే ఆధారాలు లేవు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది ఏఐ సాంకేతికతతో రూపొందించిన నకిలీ వీడియోగా ప్రచారంలో ఉంది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియోను నిజమని నమ్మకూడదనే చర్చ మరోసారి మొదలైంది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వార్తల్లో ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే నకిలీ చిత్రాలు, వీడియోలు అభిమానులను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్తల్లో కొత్త ట్విస్ట్.. గ్రీస్‌లో పెళ్లి అంటూ వైరల్, అసలు నిజం ఇదేనా?
Stock Market | అంతెత్తున ఎగిసి ఆపై దిగి వచ్చి.. చివరికి లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ఎన్ఐపీజీఆర్.. మొక్కల జన్యు నిర్మాణం, పనితీరుపై పరిశోధన చేసే సంస్థ
Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
Pyre | ఆస్కార్ రేసులో మరో భారతీయ చిత్రం.. ఇండిపెండెంట్ రూట్లో ప్రయాణిస్తున్న ‘పైర్’!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

