Animal Movie | పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘యానిమల్’.. అసలు సిసలైన గ్యాంగ్‌స్టర్ ఇతడే అంట
Animal Movie | అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా ట్రెండ్ సెట్ చేశాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో యానిమాల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు.
Animal Movie | ఇండియన్ సినిమా హిస్టరీలోనే ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ ‘యానిమల్’. ఒక్క పోస్టర్ తోనే సినిమాపై తిరుగులేని హైప్ వచ్చిందంటే ఆశా మాశీ కాదు. ఆ మధ్య కబీర్ సింగ్ (Kabhir Singh) రిలీజయ్యాక సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఓ ఇంటర్వూలో అందరూ కబీర్ సింగ్ ను వైలెంట్ ఫిలిం అంటున్నారు. అసలైన వైలెంట్ సినిమా అంటే ఏంటో నా తర్వాతి సినిమాలో చూపిస్తా అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. చెప్పినట్టుగానే అసలైన వైలెంట్ ఫిలిమ్ చూపించబోతున్నట్లు పోస్టర్ తోనే స్పష్టం చేశాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా ట్రెండ్ సెట్ చేశాడు. ఇక ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ తో యానిమాల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 11న రిలీజ్ కావల్సిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా చాలానే పెండింగ్ ఉండటంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది.
యానిమల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నట్లు సమాచారం. ఇక రణ్‌బీర్ కపూర్ రాక్ స్టార్ మూవీ తరువాత అంతలా ఇంపాక్ట్ చేసేది ఈ సినిమాలోనేని.. రణ్‌బీర్‌లో అసలు సిసలైన గ్యాంగ్‌స్టర్‌ను చూస్తారని బీ టౌన్ టాక్. కాగా మరో వారంలోపు దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక నటిస్తుంది. ఇటీవలే తన షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఈ బ్యూటీ సెట్స్‌లో దిగిన ఫోటోను అభిమానులుతో పంచుకుంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడీయోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

