Animal movie OTT | మూవీ లవర్స్‌కు రిపబ్లిక్ డే ట్రీట్.. రేపు ఓటీటీలోకి వస్తున్న ‘యానిమల్’
Animal Movie OTT | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘యానిమల్’ (Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది.
Animal Movie OTT | అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘యానిమల్’ (Animal). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మంధాన (Rashmika Mandana) హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. వారి నిరీక్షణకు తెరదించుతూ.. గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Animal movie ott release) స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ సినిమా థియేటర్ వెర్షన్లో 3 గంటల 21 నిమిషాలు ఉండగా అదనంగా ఓటీటీ వెర్షన్‌కు 8 నిమిషాలు జత చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విజయ్(రణబీర్‌కపూర్) నాన్న పిచ్చోడు. చిన్నప్పట్నుంచీ తండ్రి అంటే అలవిమాలిన ప్రేమ. నాన్నే అతని ఓ సూపర్‌హీరో. కానీ తండ్రి నుంచి మాత్రం అతను ఆశించిన ప్రేమ దక్కదు. అయినా సరే నాన్నంటే మాత్రం పిచ్చి. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తనవాళ్లకు ఏమైనా చిన్న సమస్య వచ్చినా వైల్డ్‌గా రియాక్టవుతుంటాడు. ఆ కారణంచేత తండ్రి కోపానికి గురవుతుంటాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన విజయ్, కొన్నాళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి తన ఇంటికి చేరుకుంటాడు. అప్పడే తెలుస్తుంది అతనికి తన తండ్రి ఆపదలో ఉన్నాడని. తన తండ్రిపై జరిగిన హత్యాప్రయత్నం గురించి తెలుసుకొని, దీనికి కారణమైన వాళ్లను వెతికి చంపాలనుకుంటాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? అనుకున్నది ఎలా సాధించాడు? నాన్న ప్రేమను ఎలా పొందాడు? అనేది మిగితా కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

