Anil Ravipudi | బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రముఖ షో ‘డ్రామా జూనియర్స్’ తాజా ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడి, యాంకర్ సుడిగాలి సుధీర్ ఒకరి చొక్కా మరొకరు పట్టుకున్నట్లు చూపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇది నిజమైన గొడవ కాదు.. షోలో భాగంగా చేసిన సరదా కామెడీ స్కిట్ మాత్రమే.జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న ‘డ్రామా జూనియర్స్’ కార్యక్రమానికి అనిల్ రావిపూడి, శ్రీకాంత్, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా అలరిస్తున్నారు. చిన్నారులు చేసే వినోదాత్మక స్కిట్లు ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తాజా ప్రోమోలో ఓ సినిమా సన్నివేశాన్ని స్పూఫ్గా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుధీర్ సరదాగా.. “మీ సినిమాలో నాకు ఓ పాత్ర ఇవ్వండి” అని అనిల్ రావిపూడిని అడుగుతాడు. దానికి స్పందించిన అనిల్.. “నిన్ను హీరోగా చేశాం.. మళ్లీ ఫ్రెండ్ పాత్ర చేస్తావా?” అంటూ సుధీర్ చొక్కా పట్టుకుంటాడు. ఆ తర్వాత “రోల్స్ రివర్స్” అంటూ సన్నివేశాన్ని మార్చిన సుధీర్.. అదే తరహాలో డైలాగ్ చెబుతూ అనిల్ రావిపూడి చొక్కా పట్టుకుంటాడు. దీంతో అక్కడున్న జడ్జీలు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు ప్రోమోలో చూపించారు. అయితే అసలు ఏం జరిగిందో చూపించకుండా ప్రోమోను అక్కడితో ముగించడంతో ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా వివాదం జరిగిందా? లేక కామెడీ కోసమే ఇలా చేశారా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.
పూర్తి ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతే ఆ సన్నివేశానికి సంబంధించిన అసలు విషయం వెల్లడికానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్ల కామెడీ టైమింగ్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. అనీల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో మల్టీ స్టారర్ చేస్తున్నారు.