అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. తుది దశ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమాను వచ్చే జనవరి 26న విడుదల చేస్తామని శనివారం చిత్రబృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ..‘గ్రామీణ నేపథ్యంగా సాగే ఆహ్లాదకర ప్రేమ కథ ఇది. ప్రేమలోని పలు కోణాలను స్పృశిస్తూ సాగుతుంది. ప్రధాన పాత్రలు సహజంగా ఉంటూ ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు. నవ్య స్వామి, నర్రా శీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు, సంగీతం : గోపీసుందర్.