Andrea Jeremiah | పుష్కర కాలం క్రితం వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది తమిళ బ్యూటీ ఆండ్రియా. ఆ తర్వాత పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో మెప్పించిన.. ‘తడాఖా’ సినిమాతో తెలుగులో తొలి సినిమా చేసింది. మళ్లీ ఇప్పటి వరకు ఈ అమ్మడు మరో తెలుగు స్ట్రేయిట్ సినిమా చేయలేదు. కాగా దాదాపు పదేళ్ల తర్వాత ఈ తమిళ పొన్ను తెలుగు సినిమాలో నటిస్తుంది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’ సినిమాలో ఆండ్రియా కీలకపాత్ర పోషిస్తుంది. కాగా తాజాగా ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో ఆండ్రియా జాస్మిన్ పాత్రలో నటించనుంది. చేతిలో గన్ను పట్టుకుని ఇంటెన్సీవ్‌గా చూస్తున్న ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌తోనే ఆండ్రియా క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఇక ఇన్నేళ్ల తర్వాత ఆండ్రియా తెలుగు సినిమా చేయనుండటంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆండ్రియా తెలుగు ప్రేక్షకులకు నటిగా కంటే సింగర్‌గానే ఎక్కువగా దగ్గరైంది. బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కింగ్, దడ వంటి పలు సినిమాల్లో తెలుగులో దాదాపు పదిహేను పాటల వరకు పాడింది. ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ సినిమాల్లో పాటలు పడింది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాను హిట్ సిరీస్ ఫేమ్ సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా గతకొంత కాలంగా హిట్లు లేని వెంకీ మామకు ఇది బ్లాక్‌బస్టర్ అయ్యే సినిమాలా కనిపిస్తుంది. నవాజుద్ధిన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు. వెంకటేష్‌కు జోడీగా రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Introducing JASMINE from SAINDHAV 🔥#SaindhavOnDec22
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/I6L1W5cJjI
— Andrea Jeremiah (@andrea_jeremiah) April 28, 2023