Pakka Commercial | ‘పక్కా కమర్షియల్’ అందాల రాశీ వీడియో సాంగ్ రిలీజ్!
Andala Raasi Video Song | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు గోపిచంద్. గత కొంత కాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపిచంద్‌కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం మంచి వసూళ్ళను రాబట్టింది. ప్రస్తుతం ఈయన నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుండి అందాల రాశీ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన ఈ వీడియో సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను సాయిచరణ్, రమ్య బెహర ఆలపించారు. జేక్స్ బేజోయ్ స్వర పరిచిన ఈ పాట మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. గోపిచంద్, రాశీఖన్నా కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కార్మ్ చావ్లా కెమరా విజువల్స్ బాగున్నాయి. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్ కీలకపాత్రలో నటించాడు. యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

