Pakka commercial | ‘పక్కా కమర్షియల్’ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అందాల రాశి ప్రోమో విడుదల!
Pakka commercial | వినూత్న కథలను ఎంచుకుంటూ తన శైలి నటన, అభినయంతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గోపిచంద్. గతకొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ఈయనకు ‘సీటీమార్’ చిత్రం కాస్త ఊరట నిచ్చింది. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం అప్డేట్లను మొదలు పెట్టింది. తాజాగా ఈ చిత్రంలోని అందాల రాశి ప్రోమో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘అందాల రాశి మేకప్ వేసి.. నాకోసం వచ్చావే’ అంటూ సాగే ఈ మెలోడియస్ పాటను సాయి చరణ్, రమ్య బెహరా ఆలపించారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించిన ఈ పాట పూర్తి లిరికల్ వీడియో జూన్ 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గోపిచంద్‌కు జోడీగా రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

