ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది
‘ఛాంపియన్' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసి యువతరానికి చేరువైంది మలయాళీ సుందరి అనస్వర రాజన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’ ఈ నెల 13న రిలీజ్ కానుంది.
‘ఛాంపియన్’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసి యువతరానికి చేరువైంది మలయాళీ సుందరి అనస్వర రాజన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. అనీష్ హీరోగా చయమవుతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పల దర్శకుడు. ఈ సందర్భంగా శుక్రవారం కథానాయిక అనస్వర రాజన్ విలేకరులతో ముచ్చటించింది. ఈ సినిమాలో తాను కీర్తి అనే అమాయకపు అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఇది చాలా భిన్నమైనదని చెప్పింది. ‘కీర్తి పాత్రతో ప్రతీ అమ్మాయి కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాలో హీరో మూగ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను ప్రేమను ఎలా వ్యక్తీకరిస్తాడన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ తరహా కథాంశం తెలుగులో రాలేదనుకుంటున్నా’ అని చెప్పింది. తెలుగు హీరోల్లో అల్లు అర్జున్‌కు తాను మానినని, ఆయన్ని కలుసుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని అనస్వర రాజన్ పేర్కొన్నది. ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని నాగార్జున వంటి అగ్ర టుడు ప్రజెంట్ చేయడం చాలా గర్వంగా ఉందని, సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ‘కాకా’, రవితేజ ‘తులాభారం’చిత్రాల్లో కీలక పాత్రల్ని పోషిస్తున్నానని, అలాగే సంగీత్ శోభన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నానని అనస్వర రాజన్ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

