‘ఛాంపియన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ సొగసరి అనశ్వర రాజన్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌లో చిరంజీవిని సత్యం పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో చూపించడం ఆసక్తినిరేకెత్తించింది.
మంగళవారం అనశ్వర రాజన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో అనశ్వర రాజన్ వైద్య విద్యార్థి అమ్ములు పాపగా కనిపించనుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్లో గోడపై చిరంజీవి నీడను కూడా చూపించడం ఇంట్రెస్టింగ్గా ఉంది. సత్యం పాత్ర ఆమెను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సింబాలిక్‌గా ఈ ఫస్ట్‌లుక్‌ను పోస్టర్‌ను డిజైన్ చేశారు. ‘కాకా’ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది.