ప్రభుదేవా, రెజీనా, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫ్లాష్‌బ్యాక్’. ‘గుర్తుకొస్తున్నాయి’ ఉపశీర్షిక. డాన్ సాండీ దర్శకుడు. పి.రమేష్ పిైళ్లె నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదలచేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల విడుదలచేశారు. ఈ పోస్టర్లో అనసూయ ముక్కు పుడక ధరించి కొత్తలుక్‌లో కనిపిస్తున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘ఓ జంట ప్రణయానికి వయోభేదాలు ఎలా అడ్డంకిగా మారాయన్నది ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభుదేవా రచయితగా కనిపిస్తుండగా, రెజీనా ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా నటిస్తున్నది. అనసూయ పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సీఎస్, సాహిత్యం: చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య.