Anasuya Bharadwaj | కోటకు యాంకర్ అనసూయ ఘాటు రిప్లయి.. ఎందుకంటే?!
Anasuya Bharadwaj | తన డ్రెస్సింగ్‌పై నటుడు కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలపై యాంకర్.. నటి అనసూయ భరద్వాజ్ ఘాటు రిప్లయి ఇచ్చారు.

Anasuya Bharadwaj | యాంకర్‌గా, బుల్లితెర.. సినిమా యాక్టర్‌గా అనసూయ భరద్వాజ్ పరిచయం అక్కర్లేని పేరు.. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్‌పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వేసుకునే బట్టలు నచ్చవని, అసలామే అలాంటి దుస్తులు వేసుకోవాల్సిన పని లేదన్నారు. వీలైతే డ్రస్సింగ్ స్టయిల్ మార్చుకుంటే మంచిదని హితవు చెప్పారు దీనిపై ఆమె ఘాటుగా రియాక్టయ్యారు.. కోట శ్రీనివాసరావు పేరెత్తకుండానే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ఇటీవల ఓ సీనియర్ నటుడు నాపై కొన్ని కామెంట్స్ చేశారు.. నా వస్త్రధారణపై మాట్లాడారు. అనుభవజ్ఞుడైనా అంత నీచంగా మాట్లాడటం నన్ను తీవ్రంగా బాధించింది. ఏ దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగతం.. వృత్తిని బట్టి అటువంటి దుస్తులు ధరించాల్సి రావచ్చు. ఆ సీనియర్ నటుడు మందు తాగుతూ, అధ్వాన్నమైన దుస్తులను ధరించినప్పుడు, సినిమాల్లో మహిళలను కించపరిచినప్పుడు ఎందుకీ సోషల్ మీడియా పట్టించుకోదనేది ఆశ్చర్యం అనిపిస్తుంది అని ఆమె పేర్కొన్నారు.
పెళ్లి చేసుకుని, పిల్లలను కలిగి ఉన్నవారు సినిమాల్లో నటీమణులతో రోమాన్స్ చేస్తున్నారు.. చొక్కాలిప్పి దేహాన్ని ప్రదర్శిస్తున్న యాక్టర్లను ఎందుకు ఎవరూ ప్రశ్నించరు. నేను వివాహితను. ఇద్దరు పిల్లలకు తల్లిని. పితృస్వామ్య విధానాలను ప్రశ్నిస్తూ పని చేస్తున్న నేను`నా వృత్తిలో విజయం సాధనకు కష్టపడుతున్నా.. మీ అభిప్రాయాలను చెప్పేముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని లేఖ పోస్ట్ చేశారు. పెద్దరికం.. చిన్నరికం వయస్సుతో కాదు.. అనుభవంతో వస్తాయి. ఓ నటుడిగా ఆయనంటే చాలా గౌరవం. కానీ వ్యక్తిగా ఆయన కామెంట్స్ చాలా నీచం.. అవి అనవసరం కూడా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

