Ananya panday | విజయ్ దేవరకొండ పిరికివాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరోయిన్?
Ananya panday | బాలీవుడ్ నటుడు చంకీ పాండే తనయికగా ఇండస్ట్రీలోకి వచ్చి తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటి అనన్యపాండే.
Ananya panday | బాలీవుడ్ నటుడు చంకీ పాండే తనయికగా ఇండస్ట్రీలోకి వచ్చి తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటి అనన్యపాండే. ఇక ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ రౌడి స్టార్ విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమాలో నటిస్తుంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈమె విజయ్ దేవరకొండ పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ సినిమాల్లోకనిపించేదానికి పూర్తి భిన్నంగా బయట ఉంటాడని తెలిపింది. అంతే కాకుండా విజయ్ సహజంగా పిరికివాడని చెప్పుకొచ్చింది. విజయ్ నటించిన అర్జున్‌రెడ్డి సినిమా తనకు చాలా ఇష్టమని.. సినిమాలోని ఆ క్యారెక్టర్‌కి, విజయ్ రియల్ క్యారెక్టర్‌కి అసలు పొంతనే ఉండదని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె నటించిన గెహ్రైయాన్ అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో దీపికా పదుకొణె మరో ప్రధాన హీరోయిన్గా నటించింది.
ముంబైలోని ఒక ఛాయ్‌వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్ జోహార్‌తో కలిసి తన సొంత బ్యానర్లో పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేశాయి. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 25న ప్రేక్షకులముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

