Tantra | మూవీ లవర్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వకీల్‌సాబ్ బ్యూటీ తంత్ర
Tantra | అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ డ్రామా తంత్ర (Tantra). ఈ చిత్రం మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
Tantra | మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల (Ananya Nagalla). ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ డ్రామా తంత్ర (Tantra). మార్చి 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం తంత్ర ప్రస్తుతం పాపులర్ తెలుగుఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి తంత్ర ఎలా ఉందో చూసేయండి. థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం మరి ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చెప్పాలి. తంత్రలో ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుషాలినీ, మనోజ్ ముత్యం ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
థి ఫస్ట్ కాపీ మూవీస్ అండ్ బీ ది వే ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీకి ఆర్ఆర్ ధృవ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. అనన్య నాగళ్ల ప్రస్తుతం యువ చంద్రకృష్ణతో కలిసి నటిస్తున్న చిత్రం పొట్టేల్. సవారీ ఫేం సాహిత్ మోతుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
Tantra ట్రైలర్..
తంత్ర ఓటీటీ ప్రీమియర్ అప్డేట్..
అతీంద్రీయ శక్తుల ఆవాహనం!
ఆహాలో ‘తంత్ర’ ప్రసారం!!🔯#Tantra streaming now▶️https://t.co/29Dd3wpIg7 @AnanyaNagalla @dhanush_vk @saloni_Aswani @srini_gopisetti @RaviChaith #NareshbabuP @firstcopymovies @BeTheWayFilms @TantraTheMovie pic.twitter.com/Hvnq1M7Jgj— ahavideoin (@ahavideoIN) April 4, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

