నాకు వరుడిని చూసి పెట్టినందుకు థాంక్స్. తేదీ, సమయం, వేదిక కూడా చెబితే ఆ సమయానికి పెళ్లి చేసుకునేందుకు వస్తా అంటూ సెటైర్ వేసింది నాయిక అనన్య నాగళ్ల. ఓ నిర్మాత కొడుకుతో ఆమె వివాహం నిశ్చయమైందనే వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో అనన్య ఇలా స్పందించింది. తారల వివాహాల గురించి ఇలాంటివి బయటకు రావడం సహజమే. అనన్య విషయంలో ఇలాంటి రూమర్స్ రావడం తక్కువ. తన వెడ్డింగ్ విషయంలో వచ్చిన వదంతులపై అనన్య చేసిన ట్వీట్ వ్యంగ్యంగా నవ్వించేలా ఉంది. ‘మల్లేశం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ తెలుగు భామ.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఓ తమిళ ప్రాజెక్ట్‌తో పాటు ‘శాకుంతలం’లో ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.