అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘లీసా’. జవహర్ పవార్ దర్శకుడు. వెంకట్ దుగ్గిరెడ్డి, ఐల రామకృష్ణ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి నవంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది. భారతీయ తెరపై ఇప్పటివరకూ రాని కొత్త కాన్సెప్ట్‌తో ‘లీసా’ తెరకెక్కుతున్నది.
రెండు భిన్నమైన జోనర్లను మేళవించి, సరికొత్త పద్ధతిలో ఈ సినిమా రూపొందించాం. ఈ కథ నచ్చి అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించేందుకు సిద్ధమయ్యారు. సినిమా మేకింగ్, అనన్య నాగళ్ల నటన ఈ సినిమా ప్రధాన బలాలు’ అని తెలిపారు. అల్లాల రవిరెడ్డి, సుమన్, ముసా అలీ ఖాన్, రత్నాకర్‌రెడ్డి, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత, కథనం, ఛాయాగ్రహణం: సతీష్‌రెడ్డి మాసం, సమర్పణ: అయాన్ష్రెడ్డి మాసం, నిర్మాణం: ఓంసాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ ఎంటర్టైన్మెంట్స్.