ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. టైటిల్ రోల్‌ని ఆనంది పోషిస్తున్నది. గౌరీనాయుడు జమ్ము దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని, ముఖ్యంగా కొన్ని రోజలు క్రితం విడుదలైన ఇందులోని ‘నలజీలకర్ర మొగ్గ..’ సాంగ్కైతే, సోషల్ మీడియాలో స్పందన ఓ రేంజ్లో ఉన్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇందులోని సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్డేట్ని మేకర్స్ అందించారు. ‘కోసింది కోయగూర..’ అని సాగే ఈ పాటను ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. స్టేజ్‌పై ఆడిపాడుతున్న గరివిడి లక్ష్మిగా ఆనందిని ఈ పోస్టర్లో చూడొచ్చు.