ఉత్కంఠభరితంగా ‘హైవే’

ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హైవే’. మానస రాధాకృష్ణన్ కథానాయిక. కేవీ గుహన్ దర్శకత్వంలో వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల కాన్సెప్ట్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. సైకో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. బాలీవుడ్ నటులు అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథ. పూర్తిగా హైవే నేపథ్యంలో సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్’ అన్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయని, ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అత్యధిక వ్యయంతో తెరకెక్కిస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్.కె.కింగ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

