Oke Oka Jeevitham Movie | ‘అమ్మ’ ఎమోషనల్ వీడియో సాంగ్ రిలీజ్..!
Amma Video Song | చాలా కాలం తర్వాత శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. 'మహానుభావుడు' తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్తో నిరాశలో ఉన్న శర్వాకు ఈ చిత్రం మంచి ఎనర్జీ ఇచ్చింది.
Amma Video Song | చాలా కాలం తర్వాత శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ‘మహానుభావుడు’ తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్తో నిరాశలో ఉన్న శర్వాకు ఈ చిత్రం మంచి ఎనర్జీ ఇచ్చింది. ప్రస్తుతం శర్వానంద్ ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఒపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా రోజు రోజుకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆధరణ పెరుగుతుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకార్తిక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సక్సెస్‌లో జేక్స్ బేజోయ్ మ్యూజిక్ ముఖ్య పాత్ర వహించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో అమ్మ పాటకు థియేటర్లో ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు.
తాజాగా ఈ పాట వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ రచించిన ఈ అందమైన గీతాన్ని అంతే అందగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటకు థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని అమల కీలకపాత్ర పోషించింది. అమ్మ పాత్రలో ఒదిగిపోయింది. శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

