Amitabh Bachchan | మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ జంటా విడాకులు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వార్తలు ఎక్కువవుతున్నాయి. తాజాగా క్రమంలోనే బిగ్‌బీ అమితాబచ్చన్ తన కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారనే వార్త వైరల్‌గా మారింది. అమితాబ్ ఇన్‌స్టాలో 74 మంది సెలబ్రెటీలను ఫాలో అవుతున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే, అలియా భట్, కత్రినా కైఫ్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు ఉన్నారు. ఈ అయితే, ఫాలోవర్స్ జాబితాలో ఐశ్వర్య ఇన్‌స్టా అకౌంట్ కనిపించడం లేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. బిగ్‌బీ మనవడు అగస్త్య నంద నటించిన ‘ది ఆర్చీస్’ ఇటీవల విడుదలైంది. ముంబయిలో జరిగిన చిత్రం ప్రీమియర్‌కు అమితాబ్ కుటుంబ సమేతంగా వచ్చారు.
అమితాబ్, ఐశ్వర్య బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఇందలోనే ఇన్‌స్టా అకౌంట్‌ను అన్‌ఫాలో అయ్యారన్న వార్తలు వైరల్‌గా మారింది. అయితే, కొందరు ఈ వాస్తలు కొట్టిపడేశారు. బిగ్‌బీ ఇన్‌స్టా అకౌంట్ సెట్టింగ్‌తో ఆయన ఎవరిని ఫాలో అవుతున్నారో బయటకు తెలియకపోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఇక ఐశ్వర్య తన భర్త అభిషేక్‌ను మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నది. చాలా మంది యూజర్లు అమితాబ్, ఐశ్వర్య ఒకరినొకరు ఇన్‌స్టాలో ఫాలో కావడం లేదని కామెంట్ చేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఐశ్వర్య-అభిషేక్ జంట విడిపోతున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్‌స్టా అకౌంట్‌ను అన్‌ఫాలో చేశారనే పలువురు భావిస్తున్నారు. అభిషేక్-ఐశ్వర్య 2007లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి కూతురు ఆరాధ్య ఉన్నది.