ఎవరి మాటలైతే జనాలు ఎక్కువగా వినడానికి ఇష్టపడతారో అలాంటి వాళ్ల మాటలే వైరల్ అవుతూవుంటాయ్. ఉదాహరణకు బిగ్ అమితాబ్‌బచ్చన్. ఆయన ఏ విషయం గురించైనా, ఎవరి గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆయన ఏ సందర్భంలో మాట్లాడినా అది దేశం మొత్తం వింటుంది.
అది ఆయన మాటకుండే కెపాసిటీ. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం 15వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన ప్రశ్నను అడిగారు బిగ్‌బీ. ఈ సందర్భంగా ‘పుష్ప’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘పుష్ప’ అద్భుతమైన సినిమా. అందులో ‘శ్రీవల్లీ’ సాంగ్ నిజంగా చరిత్రే సృష్టించింది. చెప్పు వదిలేయడం కూడా వైరల్ అవ్వడం నా జీవితంలో తొలిసారి చూశా. ఆ పాటలో అల్లు అర్జున్ క్యాజువల్‌గా చెప్పు వదిలేసి తొడుక్కుంటారు. ఆయన్ను చూసి అందరూ కూడా అదే స్టెప్ వేశారు. అందరూ చెప్పు వదిలేసి మళ్లీ వేసుకున్నారు..’ అంటూ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు బిగ్‌బీ. ఓ విధంగా బన్నీకి ఇది గొప్ప ప్రశంసే అని చెప్పాలి.