కేజీఎఫ్ 2 సినిమాపై అమీర్ సెన్సేషనల్ కామెంట్స్.. తన సినిమాపై నమ్మకం లేదా?
బాలీవుడ్ లో ఉన్న హీరోలలో అత్యధిక హిట్ పర్సంటేజ్ ఉన్న నటుడు అమీర్ ఖాన్. 35 ఏళ్ల కెరీర్లో ఈయన కనీసం 35 సినిమాలు కూడా చేయలేదు. ఏడాదికి ఒక్క సినిమా.. లేదంటే రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటాడు ఆమీర్ ఖాన్. కానీ ఆ చేసే సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. కాకపోతే ఈయన లెక్క తప్పుతుంది. మారుతున్న ప్రేక్షకుల మైండ్ సెట్ అర్థం చేసుకోవడంలో అమీర్ ఖాన్ కూడా కాస్త వెనుకబడుతున్నాడు. దానికి ఆయన గత సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఫలితమే నిదర్శనం. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అత్యంత దారుణంగా నిరాశపరిచింది.
దాంతో 4 ఏళ్లుగా మరో సినిమా విడుదల చేయలేదు అమీర్. తాజాగా ఈయన హీరోగా నటించిన లాల్ సింగ్ చెడ్డ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. తెలుగులో చిరంజీవి ఈ సినిమాను సమర్పిస్తుండడం గమనార్హం. పైగా గీత ఆర్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో అమీర్ ఖాన్ సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా బాగానే చేసుకుంటున్నాడు ఈ హీరో. ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా అమీర్ ఖాన్ చేసిన కొన్ని కామెంట్స్ లాల్ సింగ్ చెడ్డాపై ఆసక్తి తగ్గించేలా ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే రోజు కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదల అయింది.
ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి రోజు ఏకంగా 55 కోట్ల కలెక్షన్స్ సాధించి ఇండియన్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో పోటీ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. గ్రాఫిక్స్ ఆలస్యం కావడం వల్ల తన సినిమా అప్పుడు విడుదల కాలేదని.. దానికి ఇప్పుడు సంతోషిస్తున్నాను అని చెప్పాడు.
ఎందుకంటే కేజిఎఫ్ 2 ముందు తన సినిమా పూర్తిగా వాష్ అవుట్ అయిపోయేదని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఈ కామెంట్స్ విన్న తర్వాత తన సినిమాపై తనకే నమ్మకం లేదా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి. అమీర్ సినిమా వచ్చిందంటే బాలీవుడ్లో మిగిలిన హీరోలందరూ భయపడతారు. అలాంటిది ఒక డబ్బింగ్ సినిమాను చూసి అమీర్ ఖాన్ అంతలా భయపడ్డాడు అంటే తన సినిమాలో విషయం లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న లాల్ సింగ్ చెడ్డలో కమర్షియల్ అంశాలు తక్కువగానే ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

