ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలందుకొంది స్పానిష్ చిత్రం ‘ఛాంపియన్’. మానసిక వైకల్యంతో బాధపడే యువకులతో కూడిన బాస్కెట్ బాల్ టీమ్ పన్నెండుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నానని అగ్ర హీరో అమీర్‌ఖాన్ గతేడాది ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నానని, సల్మాన్‌ఖాన్ లీడ్ రోల్‌ను పోషించబోతున్నారని అమీర్‌ఖాన్ వెల్లడించారు. మార్చిలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఆర్.ప్రసన్నకుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అమీర్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. .