Amigos Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న అమిగోస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రిజల్ట్ సంగతి పక్కన పెడితే కళ్యాణ్‌రామ్ ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుంటాడు. ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. ఇక చాలా కాలం తర్వాత బింబిసారతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్‌రామ్ అదే జోష్‌తో ఇటీవలే అమిగోస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Amigos Movie On OTT | రిజల్ట్ సంగతి పక్కన పెడితే కళ్యాణ్‌రామ్ ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుంటాడు. ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. చాలా కాలం తర్వాత ‘బింబిసార’తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్‌రామ్ అదే జోష్‌తో ఇటీవలే ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. కానీ తీరా రిలీజయ్యాక డివైడ్ టాక్ తెచ్చుకుని పోస్టర్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.
అయితే కళ్యాణ్‌రామ్ నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. తొలిసారి త్రిపాత్రాభినయం చేసినా కానీ, ప్రతీ పాత్రకు వేరేయేషన్ చూపించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రలో జీవించేశాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 10నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. రక్త సంబంధం లేకుండా ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తులు కలుసుకోవడం.. అసలు ఆ ముగ్గురు ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది. కలుసుకున్న తర్వాత వాళ్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైయ్యాయి వంటి పలు ఆసక్తికర ఆంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. కథ కొత్తగా ఉన్నా.. కథనంలో ఆసక్తి లోపించడంతో ఈ సినిమా కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

