అమెరికా నేపథ్య ప్రేమకథ
యువ హీరో అశోక్ గల్లా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫొటోతో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
యువ హీరో అశోక్ గల్లా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫొటోతో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ‘అమెరికా నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ఆద్యంతం వినోద ప్రధానంగా మెప్పిస్తుంది. నవీన యువతరం తాలూకు ఆలోచనలు, ఆకాంక్షలకు దర్పణంలా ఉంటుంది. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో గౌరీప్రియ కథానాయికగా నటించనుంది. ఉద్భవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

