Family Star | ‘ఫ్యామిలీ స్టార్’లో అమెరికన్ నటి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Family Star | రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.
Family Star | రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. ఎస్వీసీ బ్యానర్లో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ షూరు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మృణాళ్ కాకుండా మరో కొత్త కథనాయిక ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అమెరికన్ నటి ‘మరిస్సా రోజ్ గార్డన్’ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. అలాగే మజిలీ మూవీ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ది గ్రేవ్, బ్లడ్ అండ్ బోన్, బ్లాక్ హార్ట్, వైల్డ్ సిటీ లాంటి చిత్రాలు మరిస్సాకి మంచి పేరు తెచ్చాయి. మైండ్ ఓవర్ మర్డర్ అనే టీవీ సిరీస్ కూడా ఆమెకి మంచి గుర్తింపు తీసుకోచ్చింది.
కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవకొండ ఈ సినిమాలో కనిపించనున్నారు. కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్, సంగీతం: గోపీ సుందర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

