Ambajipeta Marriage Band | మళ్లీ ఏడిపించేసిన సుహాస్.. ఆసక్తికరంగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ట్రైలర్
Ambajipeta Marriage Band | టాలీవుడ్ యువ నటుడు, కలర్‌ఫొటో ఫేమ్ సుహాస్ (Actor Suhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శివాని నగరం హీరోయిన్గా నటిస్తుంది.
Ambajipeta Marriage Band | టాలీవుడ్ యువ నటుడు, కలర్‌ఫొటో ఫేమ్ సుహాస్ (Actor Suhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'(Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శివాని నగరం హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు సాంగ్స్ విడుదల చేయగా నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. మ్యూజిక్ బ్యాండ్‌ను నమ్ముకుని బతుకుతున్న సుహాస్ ఆ ఊరిలో ఎటువంటి సమస్య వచ్చిన అన్నింటిని తనమీద వేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా అతడు లక్ష్మి అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది? అతడి అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అక్క కోసం సుహాస్ ఏం చేశాడు? అనేది ఈ సినిమా స్టోరీ.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్ మరోవైపు ఆనందరావ్ అడ్వంచర్స్ (Anandrao Adventures) సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

