Ambajipeta Marriage Band | కలర్‌ఫొటో ఫేం సుహాస్ (Suhas) నటించిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మొదటిరోజు ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ తీసుకురాగా రెండో రోజు పరుగులు పెడుతుంది.
ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.2.28 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు కూడా ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రెండో రోజు రూ. 2.5 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ రోజు వీకెండ్ కావడంతో అంబాజీపేట మ్యారేజి బ్యాండు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
సుహాస్ హెయిర్ సెలూన్ నడిపిస్తూ.. మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేస్తూ.. శివానీతో లవ్‌లో పడే యువకుడిగా కనిపించాడు.ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించాయి.