Ambajipeta Marriage Band | టాలీవుడ్ యువ నటుడు సుహాస్ (Actor Suhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'(Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్. ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 02న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనితో పాటు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
Team #AmbajipetaMarriageBand wishes you all a resounding year ahead 🎺🥁🎹
Happy New Year 2024 ❤️🔥
Grand release worldwide on February 2nd.#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati #ShekarChandra #Rahman @ashishtejapuala… pic.twitter.com/dpmZbtRoFy
— Shreyas Media (@shreyasgroup) January 1, 2024
మ్యూజిక్ బ్యాండ్లను నమ్ముకుని బతుకుతున్న కార్మికుల ఇతివృత్తంతో ఈ సినిమా రానుండగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్ మరోవైపు ఆనందరావ్ అడ్వంచర్స్ (Anandrao Adventures) సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.