Ambajipeta Marriage Band | టాలీవుడ్ నటుడు, కలర్‌ఫొటో ఫేమ్ సుహాస్ (Actor Suhas) హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. శివాని నగరం హీరోయిన్గా నటిచింది. రూరల్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.15 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక బాక్సాఫీస్ వద్ద అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమయ్యింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా మార్చి 01 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో సుహాస్ హెయిర్ సెలూన్ నడిపిస్తూ.. మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేస్తూ.. శివానీతో లవ్‌లో పడే యువకుడిగా కనిపించాడు. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
March 01st nunchi Aha lo maa Malli gaadi love story malli, malli chooseyyandi!#AmbajipetaMarriageBand premieres on Aha from March 1st.#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati #ShekarChandra @ashishtejapuala… pic.twitter.com/pM8pkKVGZD
— ahavideoin (@ahavideoIN) February 28, 2024