SSMB28 | ఆ సెంటిమెంట్‌ను వదలని త్రివిక్రమ్.. మహేష్ సినిమాకు వర్కవుట్ అవుతుందా?
Mahesh-Trivikram Movie Title | త్రివిక్రమ్-మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28పై ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. 'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కలయికలో సినిమా రూపొందనుండటంతో మహేష్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎగ్జైట్మెంట్తో ఫీలవుతున్నారు.
Mahesh-Trivikram Movie Title | త్రివిక్రమ్-మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28పై ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కలయికలో సినిమా రూపొందనుండటంతో మహేష్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎగ్జైట్మెంట్తో ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎట్టిపరిస్థుతుల్లో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్రబృందం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి గతకొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఆ పేరని, ఈ పేరని పలు టైటిల్స్ నెట్టింట షికార్లు కూడా చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ టైటిల్ మాత్రం ఫిక్సయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్‌ను చిత్రబృందం లాక్ చేసినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ ఎప్పటిలాగే అ సెంటిమెంట్ కలిసి వచ్చేలా టైటిల్‌ను పెట్టాడట. అయితే హీరో ఇమేజ్ దృష్ట్యా కాకుండా కథకు తగ్గట్టే ఈ టైటిల్‌ను త్రివిక్రమ్ ఫైనల్ చేశాడని టాక్.

ఈ సినిమా కథ గుంటూరు బ్యాక్‌డ్రాప్‌తో అమరావతికి చెరో వైపు ఉన్న ఊళ్లలో హీరోకు సంబంధం ఉన్న రెండు కుటుంబాల కథగా సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరాన్ని హీరో ఎలా తొలిగించాడు అనే నేపథ్యంలో సినిమా ఉండనుందని పలువురు చెబుతున్నారు. ఇక ఎక్కువగా సినిమా మొత్తం పల్లెటూరిలోనే సాగనుందట. కథ మరీ అంత కొత్తగా ఏమి లేకపోయినా త్రివిక్రమ్ తన మార్క్ టేకింగ్, డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ఆ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారట.

ఇందులో నిజమెంతుందో కానీ మహేష్ అభిమానులు మాత్రం టైటిల్ అదిరిపోయిందని అంటున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

