శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే ఈ చిత్రానికి దర్శకుడు. కె.ఎస్.శంకర్రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు, నిర్మాత మురళీమోహన్, హీరో అశ్విన్‌బాబు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
రెండున్నర గంటలపాటు వినోదాన్ని పంచే హారర్ థ్రిల్లర్ ఇదని, అందరూ ప్రాణం పెట్టి పని చేశారని దర్శకుడు జీవీకే తెలిపారు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందంటూ నిర్మాత ఆర్.వెంకటేశ్వరరావు నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా హీరో శివ కంఠంనేని, హీరోయిన్లు ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, నటులు రఘుబాబు, జెమినీ సురేశ్, సంగీత దర్శకుడు పద్మనాభ్ భరద్వాజ్, డీవోపీ జె.ప్రభాకర్‌రెడ్డి కూడా మాట్లాడారు.