శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అమరాతికి ఆహ్వానం’. జీవీకే దర్శకుడు. కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మాతలు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. హారర్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠను కలిగించే కథాంశమిదని దర్శకుడు తెలిపారు. తమ సంస్థలో ఆరో చిత్రమిదని, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుందని నిర్మాత వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.ప్రభాకర్ రెడ్డి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్, నిర్మాణ సారథ్యం: ముప్పా వెంకయ్య చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జీవీకే.