Bramayugam | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా భ్రమయుగం (Bramayugam). రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీని Night Shift Studios, Y Not Studio బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఏదో ఒక లుక్ విడుదల చేస్తూ.. క్యూరియాసిటీ పెంచుతోంది మమ్ముట్టి అండ్ టీం.
ఈ చిత్రంలో అమల్ద లిజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ లుక్‌ను విడుదల చేశారు. ముక్కుపుడక, నడుముకు హారంతో ఆదివాసీ వ్యక్తిని పోలిన గెటప్‌లో ఉన్న అమల్ద లిజ్ లుక్ స్టన్నింగ్‌గా కనిపిస్తోంది. ఈ లుక్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీ నుంచి ఇటీవలే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకున్న లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మరోవైపు ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్న సిద్దార్ధ్ భరతన్ (Sidharth Bharathan) లుక్ షేర్ చేయగా.. రక్తపు మరకలతో ఉన్న సిద్దార్థ్ భరతన్ డార్క్ షేడ్స్‌లో ఓ గుమ్మంలో నుంచి కాగడా పట్టుకొని.. కొంచెం భయంగా నడుచుకుంటూ వస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, జిసు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భ్రమయుగం గతేడాది ఆగస్టులో షురూ అయి.. అక్టోబర్ 18న పూర్తయింది. ఈ చిత్రాన్ని మమ్ముట్టి టీం కేవలం రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేయడం విశేషం. ఈ చిత్రాన్ని ఒట్టపాలెం, కోచి, అథిరపల్లి టి ప్రాంతాల్లో చిత్రీకరించినట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. మమ్ముట్టి ఖాతాలో మరో మూడు మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. మమ్ముట్టి మరోవైపు గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న బజూక (Bazooka)లో కీ రోల్ పోషిస్తున్నాడు.
డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తుండగా.. మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు.
స్టన్నింగ్‌గా అమల్ద లిజ్ పోస్టర్..
#AmaldaLiz from #Bramayugam !
.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/bqQ5xNWAFA
— BA Raju’s Team (@baraju_SuperHit) January 4, 2024
#SidharthBharathan from #Bramayugam
.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/hduU2t8kHI
— BA Raju’s Team (@baraju_SuperHit) January 3, 2024
భ్రమయుగం షూట్‌కు ప్యాకప్..
It’s a Wrap for #Bramayugam ! #Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/YPGSDI5xw6— Night Shift Studios LLP (@allnightshifts) October 18, 2023
భ్రమయుగం లుక్..
#Bramayugam – Mammookka’s next, shoot commences today !
Written & Directed by Rahul Sadasivan…👏👏👏
Genre – Horror…#Mammootty @mammukka pic.twitter.com/yvOaKchFAY— AB George (@AbGeorge_) August 17, 2023