అదే ఆసలైన ఆనందం

శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో తనను తాను సంపూర్ణంగా అర్థం చేసుకునే మహిళ మనశ్శాంతితో జీవిస్తుందని చెప్పింది కథానాయిక అమలాపాల్. సముద్రతీరంలో అందాలు ఆరబోస్తూ ఈ భామ తీయించుకున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వీటిపై తనదైన శైలిలో వ్యాఖ్యానించింది అమలాపాల్. ఆమె మాట్లాడుతూ ‘నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే జిజ్ఞాస, వ్యక్తిగత వృద్ధికి ప్రాధాన్యతనివ్వడం, అభిరుచుల మేరకు జీవితాన్ని సాగించడమే ప్రతి మహిళ కర్తవ్యం కావాలి. అదే అసలైన ఆనందం తీసుకొస్తుంది. నేనూ అదే పంథాను ఫాలో అవుతున్నా. ఎవరితో ఎలాంటి పోలికలు పెట్టుకోకుండా నాలోని అత్యుత్తమ ప్రతిభను కనబరిచే ప్రయత్నం చేస్తున్నా. అందుకే గత కొన్నేళ్లుగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రశాంత జీవితాన్ని ఆస్వాదిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. దక్షిణాదిన తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం అభినయ ప్రాధాన పాత్రల వైపు దృష్టి పెడుతున్నది. లేడీ ఓరియెంటెడ్ కథాంశాల్ని ఎంపిక చేసుకుంటూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

