‘నాకు పోలీస్ అంటే గొప్ప గౌరవం. ఆ వృత్తిపై ప్రేమతో ఇలా మీ ముందుకు పోలీస్ డ్రెస్లో వచ్చా. ఇది ప్రమోషన్లో ఓ భాగమే అనుకోవచ్చు’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్వర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘అల్లూరి’ చిత్రాన్ని ఆయన నిర్మించారు.
ఈ నెల 23న విడుదలకానుంది. బెక్కెం వేణు మాట్లాడుతూ ‘ఇదొక ఫిక్షనల్ పోలీస్ బయోగ్రఫీ. ఈ నెల 3న అల్లూరి సీతారామరాజుగారి సమాధి దగ్గరి నుంచి యూనిట్ అంతా యాత్రని ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో టూర్ చేసి పోలీస్ అధికారుల్ని సన్మానిస్తాం. ఓ పోలీస్ జీవితప్రయాణాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి పోలీస్ వృత్తిపై గౌరవం రెట్టింపవుతుంది’ అన్నారు.