Urvasivo Rakshasivo | అప్పుడే ఓటీటీలోకి ఊర్వసివో రాక్షసివో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చాలా కాలంగా అల్లు శిరీష్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. కాగా 'ఏబిసిడి' తర్వాత నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Urvasivo Rakshasivo Movie On OTT | చాలా కాలంగా అల్లు శిరీష్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. కాగా ‘ఏబిసిడి’ తర్వాత నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు మందు ఈ సినిమా టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల నడుమ నవంబర్ 4న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే నటన పరంగా శిరీష్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్9 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈచిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. అల్లు శిరీష్‌కు జోడీగా అను ఇమాన్యూయేల్ నటించింది. అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్, పృథ్విచంద్ర కీలకపాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

