Allu Arjun | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కెరీర్ ఆరంభం నాటి క్లాసిక్, స్టైలిష్ లుక్‌తో కూడిన ఒక వింటేజ్ పోస్టర్‌ను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 90ల నాటి సినిమా స్టిల్లా అన్నట్లుగా ఉన్న ఈ క్రేజీ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్లో పవన్ కల్యాణ్ ఒత్తుగా ఉన్న కర్లీ హెయిర్, షార్ప్ లుక్ మరియు బ్లాక్ టీ-షర్ట్‌తో సరికొత్త స్టైలిష్ వైబ్స్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన ట్రిబ్యూట్ పోస్టర్ ద్వారా అల్లు అర్జున్ తన బాబాయ్ పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. మెగా అభిమానులు సైతం ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ పవన్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.
Many Happy Returns of the day to Power Star @PawanKalyan garu#OGPowerStar pic.twitter.com/BdlAx8B3o7
— Allu Arjun (@alluarjun) September 2, 2026