Allu Arjun | రచయితగా మారుతున్న ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్..

Allu Arjun | ఇప్పుడు మన హీరోలు కేవలం నటనకు మాత్రమే పరిమితం కావడం లేదు. మిగిలిన విభాగాల్లోనూ తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది హీరోలు నిర్మాణ రంగంలోకి అడుగుపెడితే.. మరికొందరు సొంతంగా కథలు రాసుకుంటున్నారు. తామే వాటిని డైరెక్ట్ చేసి హిట్స్ కొడుతున్నారు. ఇప్పటికే అడవి శేష్, కిరణ్ అబ్బవరం వంటి యంగ్ హీరోలు తమ సినిమాలకు తామే కథ, స్క్రీన్‌ప్లే రాసుకుంటున్నారు. వాటితో హిట్స్ కొడుతున్నారు. విశ్వక్ సేన్ కూడా తన ఫలక్‌నుమా దాస్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఇదే బాటలో మరో హీరో కూడా తన టాలెంట్‌ను చూపించబోతున్నాడు. అయితే ఈసారి మాత్రం యంగ్ హీరో కాదు.. ఒక స్టార్ హీరో రచయితగా మారి ఒక స్రిప్ట్ రాస్తున్నాడు.
ఇంతకీ ఎవరా స్టార్ హీరో అని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు.. తాజాగా పుష్ప సినిమా సక్సెస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ త్వరలోనే రచయితగా మారి ఒక కథను రాయబోతున్నాడట. అంతేకాదు మొత్తం యంగ్ టాలెంట్‌తో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. బన్నీ నటించిన పుష్ప సినిమా ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతోంది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్ల నుంచి స్టడీగానే కలెక్షన్స్ సాధిస్తుంది. పుష్ప సినిమా తాజాగా హిందీలో 100 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి.. బాలీవుడ్ స్టార్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

