పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ హీరోగా మారి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పెరిగిపోయింది. బన్నీకి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బన్నీ ఫాలోవర్ల కోసం ఓ స్టిల్‌ను షేర్ చేసింది అతడి సతీమణి స్నేహ (Allu Sneha).
హైదరాబాద్‌లో అల్లు అర్జున్-స్నేహ దంపతులు (Allu Arjun-Sneha) ఔటింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఓ సెల్పీ తీసుకున్నారు. ఇదే సెల్పీని స్నేహ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. డార్క్ బ్లూ కలర్ ట్రౌజర్‌లో బన్నీ, తెలుపు రంగు కోట్లో స్నేహ క్యూట్ స్మైల్ ఇస్తూ దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్నేహ పెట్టిన సెల్ఫీ పోస్ట్‌కు 2 లక్షల 40వేలకుపైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు ఇద్దరూ చాలా అద్బుతంగా కనిపిస్తున్నారు..సో క్యూట్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
సుకుమర్ డైరెక్షన్ లో బన్నీ నటించిన పుష్ప..ది రైజ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి కలెక్షన్ వర్షం కురిపించింది. మరోవైపు రెండో పార్టు పుష్ప ది రూల్ చిత్రీకరణ దశలో ఉంది.