కొత్త అల్లు అర్జున్ను చూస్తారు

‘పాన్ ఇండియన్ సినిమా చేయాలనే మా కల ఈ సినిమాతో తీరింది. సుకుమార్ చెప్పిన కథ వినగానే అన్ని భాషల వారికి చేరువ అవుతుందనిపించింది’ అని అన్నారు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వారు నిర్మించిన తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, సీఈఓ చిరంజీవి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి
ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో సినిమాను విడుదలచేయబోతున్నాం. అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎర్రచందనం అక్రమరవాణాతో పాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది. రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. మాస్ కథకు క్లాస్ హంగులను మేళవిస్తూ అన్ని వర్గాల్ని అలరించేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దారు.
క్లిష్టమైన పరిస్థితుల్లో
దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటల్ని స్వరపరిచారు. ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలు సూపర్‌హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. సినిమా చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పటివరకు ఎవరూ వెళ్లని అరుదైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం.ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నాం. ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. ‘అఖండ’ విజయం మాలోనూ ఉత్సాహాన్ని నింపింది. ఆ విజయపరంపరను మా చిత్రం కొనసాగిస్తుందనే నమ్మకముంది.
గుర్తుండిపోయే సినిమా
గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త పంథాలో అల్లు అర్జున్ కనిపిస్తారు. చిత్తూరు యాసలో ఆయన చెప్పిన సంభాషణలు మెప్పిస్తాయి. బన్నీ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమా కోసం ఏడాది మొత్తం పుష్పరాజ్ పాత్రలోనే ఉండిపోయారు. ఆయన మేనరిజమ్స్ విభిన్నంగా ఉంటాయి. పుష్పరాజ్ పాత్రకు సంబంధించి ఆయన మేకప్‌కోసమే ప్రతిరోజు రెండు గంటలు సమయం పట్టేది. ఫహాద్‌ఫాజిల్ మా అందరి ఊహలకు మించి అద్భుతంగా నటించాడు. రష్మిక మందన్న, సునీల్, అనసూయతో పాటు ప్రతి క్యారెక్టర్ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ప్రతీ భాషలోనూ చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌నే చూపించాం. ‘పుష్ప’ సెకండ్‌పార్ట్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెడతాం. ప్రస్తుతం మా సంస్థలో మహేష్‌బాబు ‘సర్కారువారి పాట’, నాని ‘అంటే సుందరానికి’ సినిమాలు చేస్తున్నాం. చిరంజీవి సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. బాలకృష్ణతో చేయబోతున్న చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్‌పైకి తీసుకొస్తాం. కల్యాణ్‌రామ్‌తో ‘అమిగోస్’ అనే చిత్రం చేయబోతున్నాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

