Allu Arjun Multiplex | మరో కొత్త మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్.. ఈసారి ఎక్కడంటే.?
Allu Arjun Multiplex | టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వగా తాజాగా రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
Allu Arjun Multiplex | టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వగా తాజాగా రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మాస్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ కట్టబోతున్నట్టు సమాచారం. ఇదిలావుంటే అల్లుఅర్జున్ కొత్తగా మరో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో AAA సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ బన్నీ తాజాగా మరో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాదు ఏపీలో. అవును వైజాగ్‌లో అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లో కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్లో ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఇంతకుముందు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి Asian Mahesh Babu (AMB) మల్టీప్లెక్స్ కట్టి బాగా సక్సెస్ అయ్యారు. ఇక మహేష్ తర్వాత రౌడి హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మహబూబ్ నగర్లో AVD సినిమాస్ (Asian Vijay Devarakonda) అనే పేరుతో మల్టీప్లెక్స్ స్థాపించి సక్సెస్ అయ్యాడు. వీరిద్దరి తరువాత అల్లు అర్జున్ (Alu Arjun) కూడా AAA సినిమాస్ అని హైదరాబాద్ అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఇక మాస్ హీరో రవితేజ ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ నిర్మిస్తుండగా.. ఇది హైదరాబాద్ దిల్సుఖ్ నగర్‌లోని వెంకటాద్రి థియేటర్‌ను కూల్చి మల్టీప్లెక్స్‌గా కడుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇందులో మొత్తం ఐదు స్క్రీన్లు ఉండనున్నట్లు టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

