అల్లు అర్జున్ (Allu Arjun)కు తెలుగుతోపాటు మలయాళంలో కూడా కోట్లాదిమంది అభిమానులున్నారని తెలిసిందే. అయితే పుష్ప సినిమా తర్వాత నార్తిండియా ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయాడు బన్నీ. ప్రతీ ఒక్కరూ పుష్పరాజ్‌ను ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించారంటే అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిపోయిందో చెప్పొచ్చు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం హైదరాబాద్‌లో యాడ్ షూట్లో పాల్గొన్న ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
హరీష్ శంకర్ (Harish Shankar)డైరెక్షన్లో ఆస్ట్రాల్ పైప్స్ యాడ్ షూట్లో పాల్గొంటున్నాడు. కాగా సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ (Avinash Gowarikar) సెట్స్‌లో క్లిక్ మనిపించిన అల్లు అర్జున్ బీటీఎస్ స్టిల్స్‌ను షేర్ చేయగా.. ఇప్పుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. డబుల్ ఇయర్ రింగ్స్ తో న్యూ ఆల్ట్రా స్లైలిష్ లుక్ లో మెరువబోయే యాడ్ కోసం అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ ప్రస్తుతం పలు బ్రాండ్లను ఎండార్స్ మెంట్ పనిలో బిజీగా ఉన్నాడు.
తమ అభిమాన హీరో యాడ్స్ కోసం ఇలా కనిపిస్తుంటే..ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తాడా..? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫాలోవర్లు, ఫ్యాన్స్. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప..ది రూల్ సినిమా చేస్తుండగా..షూటింగ్ షురూ అయ్యే డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.